'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి' | sc, st subplan funds are diverting, laxman alleges government | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి'

Published Thu, Feb 12 2015 7:22 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి' - Sakshi

'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి'

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఈ పథకానికి ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 15 శాతం కూడా ఖర్చు చేయటం లేదన్నారు. ఈ నిధులను దారిమళ్లకుండా ఉండాలంటే ఎస్సీ సబ్ ప్లాన్ చట్టానికి సవరణలు చేయాలని ఆయన సూచించారు. దళిత, గిరిజన సంక్షేమంపై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన మంత్రులు, అందుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లేకపోతే దళిత, గిరిజన సంఘాలతో కలిసి బీజేపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement