‘ఉపకార’ దరఖాస్తులు 13.06 లక్షలు | The 'scholarship' applications are 13.06 lakh | Sakshi
Sakshi News home page

‘ఉపకార’ దరఖాస్తులు 13.06 లక్షలు

Published Sat, Dec 2 2017 2:09 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

The 'scholarship' applications are 13.06 lakh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు రాష్ట్రవ్యాప్తంగా 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి 13 లక్షల దరఖాస్తులు వస్తాయని సంక్షేమ శాఖలు భావించగా వారి అంచనాలకు మించి 6వేల దరఖాస్తులు అధికం గా వచ్చాయి. 2016–17 విద్యా సంవత్సరం లో 13.67 లక్షలు రాగా ఈ ఏడాది 61 వేల దరఖాస్తులు తగ్గాయి. ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి చేపట్టిన మార్పులతో అడ్మిషన్లు పడిపోయాయి.

డిగ్రీ ప్రవేశాల్లో చేపట్టిన ఆన్‌లైన్‌ విధానం, ఇంటర్మీడియెట్‌లో గడువు విధించడం, పీజీ ప్రవేశాల్లో ఆన్‌ లైన్‌ ప్రక్రియ వివాదాస్ప దం కావడంతో చాలామం ది విద్యార్థులు ప్రవేశాలకు నోచుకోలేదు. దీం తో దరఖాస్తులు తగ్గిపోయాయి. కొందరు విద్యార్థులైతే అసలు దరఖాస్తు చేసుకోలేదు. మరోవైపు ఈ పథకాల కింద చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి చేపట్టేలా సంక్షేమ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సర దరఖాస్తులకు సంబంధించి పరి ష్కార చర్యలు మొదలుపెట్టారు. ఇటీవల ఫీజు బకాయిలు విడుదల చేయడంతో ఆయా శాఖలు వాటి పంపిణీ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి.


2017–18లో వచ్చిన దరఖాస్తులు
కేటగిరీ                  దరఖాస్తులు
బీసీ                      7,22,926
వికలాంగ                   252
ఈబీసీ                   86,708
మైనారిటీ              1,29,822
ఎస్సీ                   2,33,476
ఎస్టీ                    1,33,780  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement