అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ బాబా తాజుద్దీన్ తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 వ తరగతి, ఇంటర్, పీహెచ్‌డీ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం అందించే పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ ఉపకార వేతనాల కోసం ఈ నెల 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను http://scholarships.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. తెల్లరేషన్‌కార్డు దారులు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సిన అవసరం లేదన్నారు. పింక్ రేషన్ కార్డు కలిగిన వారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలన్నారు. దరఖాస్తులను ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఫార్వర్డ్ చేయాలన్నారు. వివరాలకు 08554–246615 నంబర్లో సంప్రదించాలన్నారు.
ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
Published Fri, Sep 1 2017 9:29 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement