అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు | Semi-nude dances at midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు

Oct 25 2014 2:21 AM | Updated on Aug 1 2018 2:35 PM

అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు - Sakshi

అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు

ఓ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. సూడాన్ దేశానికి చెందిన దాదాపు 200 మంది యువతీ యువకులు అర్ధనగ్న

‘హనీబర్గ్’లో 200 మంది సూడాన్ యువతీ యువకుల హంగామా
 
మేడ్చల్: ఓ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. సూడాన్ దేశానికి చెందిన దాదాపు 200 మంది యువతీ యువకులు అర్ధనగ్న నృత్యాలు చేస్తుండగా పోలీసులు ముప్పేటదాడి చేశారు. వారిలో ఐదుగురు పట్టుబడగా.. మిగతా వారు పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం యాడారం శివారు రాజీవ్ రహదారిపై ఉన్న హనీబర్గ్ రిసార్ట్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నగరంలో ఉండే సూడాన్ దేశానికి చెందిన  యువతీ యువకులు గురువారం రాత్రి హనీబర్గ్ రిసార్ట్‌కు వచ్చారు.

ఈత కొలను వద్ద డీ జే ఏర్పాటు చేసుకొని మద్యం మత్తులో అర్ధనగ్న నృత్యాలు చేయసాగారు. కొందరు డ్రగ్స్ తీసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రి తర్వాత డీజే సౌండ్ మితిమీరిపోవడంతో యాడారం, మురహరిపల్లి గ్రామస్తులు మేడ్చల్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ గోపరాజు ఆధ్వర్యంలో రిసార్ట్‌పై దాడి చేశారు. దాదాపు 200 మంది యువతీ యువకులు అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారు పోలీసుల్ని తోసేసి పరారయ్యారు. ప్రధాన నిందితులైన మ్యూకర్(24), అబ్దుల్ రెహ్మాన్(21), శేఖర్(24), ఎండీ ఒమర్(25), ఎండీ కమల్(25)లను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement