Sudan country
-
సూడాన్‌లో యుద్ధవాతావరణం.. భారతీయులను హెచ్చరించిన ఎంబసీ
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. సూడాన్‌లో ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. The Sudan Air Force in happier times putting on an air show over Khartoum - today these same planes may be launching unguided missiles into the city attacking paramilitary Rapid Support Forces (RSF) pic.twitter.com/kpJJrb1wG4 — James A. Tidmarsh (@jtidmarsh) April 15, 2023 వివరాల ప్రకారం.. సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం, ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు.. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పౌరులు భయాందోళనలకు గురై వీధుల నుంచి పరుగులు పెట్టారు. NOTICE TO ALL INDIANS IN VIEW OF REPORTED FIRINGS AND CLASHES, ALL INDIANS ARE ADVISED TO TAKE UTMOST PRECAUTIONS, STAY INDOORS AND STOP VENTURING OUTSIDE WITH IMMEDIATE EFFECT. PLEASE ALSO STAY CALM AND WAIT FOR UPDATES. — India in Sudan (@EoI_Khartoum) April 15, 2023 ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమతమై.. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూడండి అని తెలిపింది. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాడులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 🚨🚨🚨 🇸🇩🇸🇩🇸🇩 RSF : fighters said they have taken control of Marawi airport. #Sudan#Sudan pic.twitter.com/tIp8gyzq3L — MT WORLD (@MTWORLDNEWS) April 15, 2023 SUDAN pic.twitter.com/SMaHudcPSF — Nuradinsaidmohamed (@Nuradinsaidmoh1) April 15, 2023 BREAKING: Planes on fire at Khartoum airport after coup attempt in Sudan pic.twitter.com/aWdyMv23xs — BNO News (@BNONews) April 15, 2023 #WATCH: Civilians trapped at #Khartoum international airport as #UAE-funded Rapid Support Forces besiege. The @_AfricanUnion & @AUC_MoussaFaki must respond now & build international support to curtail this incoming catastrophe. #Sudan pic.twitter.com/lxtnhLNRUR — Suldan I. Mohamed, MA (@SuldanMohamed_) April 15, 2023 -
అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు
‘హనీబర్గ్’లో 200 మంది సూడాన్ యువతీ యువకుల హంగామా మేడ్చల్: ఓ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. సూడాన్ దేశానికి చెందిన దాదాపు 200 మంది యువతీ యువకులు అర్ధనగ్న నృత్యాలు చేస్తుండగా పోలీసులు ముప్పేటదాడి చేశారు. వారిలో ఐదుగురు పట్టుబడగా.. మిగతా వారు పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం యాడారం శివారు రాజీవ్ రహదారిపై ఉన్న హనీబర్గ్ రిసార్ట్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నగరంలో ఉండే సూడాన్ దేశానికి చెందిన యువతీ యువకులు గురువారం రాత్రి హనీబర్గ్ రిసార్ట్‌కు వచ్చారు. ఈత కొలను వద్ద డీ జే ఏర్పాటు చేసుకొని మద్యం మత్తులో అర్ధనగ్న నృత్యాలు చేయసాగారు. కొందరు డ్రగ్స్ తీసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రి తర్వాత డీజే సౌండ్ మితిమీరిపోవడంతో యాడారం, మురహరిపల్లి గ్రామస్తులు మేడ్చల్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ గోపరాజు ఆధ్వర్యంలో రిసార్ట్‌పై దాడి చేశారు. దాదాపు 200 మంది యువతీ యువకులు అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారు పోలీసుల్ని తోసేసి పరారయ్యారు. ప్రధాన నిందితులైన మ్యూకర్(24), అబ్దుల్ రెహ్మాన్(21), శేఖర్(24), ఎండీ ఒమర్(25), ఎండీ కమల్(25)లను అదుపులోకి తీసుకున్నారు. -
సుడాన్లో పోరంకి ఇంజినీర్ పాట్లు
=భారత్‌కు రావాలని 40 మంది ఎదురుచూపు = కుటుంబ సభ్యుల్లో ఆందోళన = ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి పెనమలూరు, న్యూస్‌లైన్ : సుడాన్ దేశంలో జరుగుతున్న అంతర్గత పోరు కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన ఓ యువ ఇంజినీర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అతనితోపాటు భారతదేశానికి చెందిన 40 మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సుడాన్లో ఉన్న వారిని సురక్షితంగా భారతదేశానికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోరంకి గ్రామానికి చెందిన నల్లమోతు మురళీ కుమారుడు నల్లమోతు కిరణ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి గత ఏడాది దక్షిణ సుడాన్‌లోని పలోజాలో ఉన్న స్టార్ కాంట్రాక్టింగ్ ఆయిల్ ఆండ్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అతను గత మార్చి నెలలో భారత్‌కు వచ్చి జూన్‌లో తిరిగి సూడన్‌కు వెళ్లారు. ఆ దేశంలో అంతర్గత యుద్ధం సందర్భంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుడాన్ రాజధాని జుబ్బాకు 400 కిలోమీటర్ల దూరంలో పలోజాలో కిరణ్ పని చేస్తున్నారు. అక్కడ మిలిటెంట్ పోరు జరగడంతో కిరణ్‌తోపాటు మరో 40 మంది భారతీయులు కంపెనీలోనే చిక్కుకుపోయారు. వారు భారత్‌కు రావటానికి అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను మాత్రం ఆయా దేశాలు సురక్షితంగా తీసుకు వెళ్లాయి. అయితే భారత్‌కు చెందిన వారిని మాత్రం ఎవ్వరు పట్టించుకోవటంలేదని కిరణ్ స్వయంగా ఫోన్లో న్యూస్‌లైన్‌కు మంగళవారం తెలిపారు. తాము జుబ్బాకు చేరుకోగలిగితే భారత్‌కు రాగలుగుతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలి... సుడాన్లో చిక్కుకుపోయిన తమ కుమారుడు, మరో 40 మందిని ప్రభుత్వం భారత్‌కు తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కిరణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సుడాన్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున తక్షణం ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న వారిని ఇక్కడకు సురక్షితంగా తీసుకువావాలని కోరుతున్నారు.