కరీంనగర్ క్రైం: కరీంనగర్ మండలం చింతకుంట గ్రామంలో ఓ బాలిక(7)పై అదే గ్రామానికి చెందిన బాలుడు (16) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బాలిక ఇంటిపక్కనే తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్న బాలుడు పదవ తరగతి అనంతరం చదువు మాని వేశాడు. తరచూ బాలిక ఇంటికి వచ్చి పిల్లలను ఆడిస్తూ ఉండేవాడు. గురువారం బాలిక కడుపునొప్పితో పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయింది.
సాయంత్రం బాలుడు పక్కంటికి వచ్చి బాలికతోపాటు ఆమె చిన్న తమ్ముడు మూడేళ్ల బాబును ఎత్తుకుని తమ ఇంటికి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. వెంటనే బాలుడు బాధిత బాలిక తమ్ముడిని తీసుకుని వచ్చి వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. బాలిక భయభయంగా ఉండడంతోపాటు సున్నిత అవయవాల వద్ద రక్తస్రావం అవుతుండడంతో గమనించిన తల్లి తండ్రికి సమాచారం అందించింది. ఏమైందని బాలికను అడిగితే జరిగిన విషయం చెప్పింది. తండ్రి ఇంటికి వచ్చే సరికి అర్ధరాత్రి అయింది.
వచ్చిన వెంటనే కూతురు పరిస్థితి గమనించి కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. కుమార్తెను ఆస్పత్రికి తరలించాడు. రూరల్ ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ నరేందర్ తెలిపారు. నిందితుడి అచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం
Published Sat, Dec 13 2014 1:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement