నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా? | Sitting on the banks of the .. otladugutara today? | Sakshi
Sakshi News home page

నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా?

Published Wed, Apr 2 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా?

నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా?

కాంగ్రెస్ నేతలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న

 డిచ్‌పల్లి/జక్రాన్‌పల్లి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒడ్డున కూర్చున్నవారికి ఓటు వేస్తారో, పోరాడిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ప్రజలను కోరారు. తెలంగాణ వికాసం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యమం కొనసాగినప్పుడు ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పనంగా ఎవరి చేతిలోనే పెట్టడం సమంజసం కాదన్నారు.‘మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం’ అని ఆమె పిలుపునిచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement