రైల్వే బుకింగ్ కార్యాలయంలో పాము | snake in railway booking offfice | Sakshi
Sakshi News home page

రైల్వే బుకింగ్ కార్యాలయంలో పాము

Published Sat, Nov 22 2014 7:37 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

snake in railway booking offfice

హైదరాబాద్: వచ్చీ పోయే రైళ్లు.. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్ కిటకిటలాడిపోతోంది. రైల్వే సిబ్బంది వారి పనుల్లో నిమగ్నమైవున్నారు. టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు బారులు తీరి ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏ మూలన ఉందో కానీ.. రైల్వే బుకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. అంతే రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రైల్వే సిబ్బంది బతుకుజీవుడా అంటూ పరుగు అందుకున్నారు. క్యూలో ఉన్న ప్రయాణికులు చెల్లచెదురై పరుగులు తీశారు. వరంగల్ జిల్లా మహబూబ్ బాద్ రైల్వే స్టేషన్లో శనివారం ఈ సంఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement