సామాజిక అధ్యయనం పెరగాలి | Social study of the gilts | Sakshi
Sakshi News home page

సామాజిక అధ్యయనం పెరగాలి

Published Tue, Sep 9 2014 6:08 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Social study of the gilts

  •     అందుబాటులోని వనరులనే ప్రయోగాలకు వాడుకోవచ్చు..
  •      పింగిళి కళాశాల సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం
  • వడ్డేపల్లి : సామాజిక శాస్త్ర అధ్యయనాలు పెరగాల్సిన అవసరంతో పాటు పాఠ్యాంశాల సిలబస్ ను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హన్మకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో ‘సామాజిక శా స్త్రం- సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గా లు’ అంశంపై ఏర్పాటుచేసిన రెండు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది.

    ఈ సదస్సును ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించగా, కోదండరాం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మన చుట్టూ ఉన్న సమాజమే ఒక లేబొరేటరీ అని, జిల్లాను ఒక ప్రయోగశాలగా చేసుకుని అధ్యయనాలు చేయొచ్చని తెలి పారు. సోషల్ సెన్సైస్‌పై ఇప్పుడిప్పుడే మక్కు వ పెంచుకుంటారని, ఈ మేరకు సిలబస్‌ను వృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. అయి తే, బోధకుల సంఖ్య సరిపడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    పౌరహక్కులను యూనివర్సిటీలు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడిన కోదండరాం.. ఆర్థిక ఆలంబనగా నిలిచి ఇప్పుడు కనునమరుగవుతున్న చేతివృత్తులపై పరిశోధన చేయాలని సూచించారు. పరిశోధనలోనే వాస్తవాలు వెలుగు చూసి, పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు. పాలకులు పాశ్చాత్య దేశాల రాజ్యాంగ మీద అధ్యయనాలు చేశారే కానీ ఘర్షణలపై అధ్యయనాలు చేయలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు లోతైన సామాజిక పరిశోధనలు జరగాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిందని తెలిపారు.

    ఈ మేరకు వరంగల్‌లోని కేయూలో కూడా స్థానిక సమస్యల అధ్యయనాలకు చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్, మెడిసిన్ అంటూ వెళ్తే సమాజం వృద్ధి చెంద దని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సోషల్‌సైన్స్, విజ్ఞానశాస్త్రం రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సామాజి క శాస్త్రం దోహదపడుతుందన్నారు. ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపిందని తెలిపారు.
     
    ఐసీఎస్‌ఎస్‌ఆర్ ద్వారా కృషి
     
    సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్) ద్వారా కృషి జరుగుతోందని సంస్థ దక్షిణాది ప్రాంతీయ కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ జి.కృష్ణారెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్రంగా హైదరాబాద్‌లోని పని చేస్తున్న ఈ కేంద్రం ద్వా రా సామాజిక పరిశోధనలు చేసే వారిని సంస్థ ప్రోత్సహిస్తూ వారికి, కావాల్సిన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు  కోదండరాం, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో పాటు కృష్ణారెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అడప సత్యనారాయణను సన్మానించారు. అనంతరం అధ్యాపకుడు వేణు ఆర్థిక సహకారంతో కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సరస్వతిదేవి విగ్రహాన్ని ఎమ్మె ల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో కన్వీనర్ ఆర్.కవిత, ఆర్గనైజర్ విజయలక్ష్మితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement