రైతు ఆత్మహత్యలు నివారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు.
రైతాంగ సమస్యలపై ప్రతిరోజు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. రైతు ఆత్మహత్యలు అత్యంత బాధాకరమని అన్నారు.