రాజేంద్రనగర్ ( హైదరాబాద్) : నకిలీ అల్లం పచ్చడిని తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఒక ఫ్యాక్టరీలో నకిలీ అల్లం పచ్చడి తయారు చేస్తున్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడి చేసి రూ. 15 లక్షలు విలువ చేసే అల్లంను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.