బీబీనగర్: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న ప్రజల సంఖ్యను, పలు విభాగాల్లోని వైద్య పరికరాలను పరిశీలించారు.
ఆస్పత్రిలో వాట ర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మాసీ పరీవాహక ప్రాంతం కావడంతో నిమ్స్‌లో చర్యవాధ్యులకు సంబంధించిన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్‌కు వచ్చి వెళ్లే వారి కోసం జాతీయ రహదారిపై బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసి ఇక్కడ స్టాప్ ఉండేలా ఆర్టీసీ అధికారులతో చర్చించామని త్వర లో ఆ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
ఓపీ కార్డు తీసుకుని..
ఇటీవల మిషన్ భగీరథ ప్రారంభ పనుల్లో పాల్గొన్నప్పుడు ఎడమ కాలు బెనకడంతో నొప్పిగా ఉందంటూ మంత్రి నిమ్స్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వైద్యుడితో చికిత్స చేయించుకున్నారు. 50 రూపాయలు చెల్లించి తన పేరుపై ఓపీ కార్డును తీసుకొని డాక్టర్ రాసి ఇచ్చిన మందులను కొనుగోలు చేశారు.
పీహెచ్‌సీ వైద్యులను మందలించిన మంత్రి
బీబీనగర్ పీహెచ్‌సీ వైద్యులు సమయపాలన పాటించడం లేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్ వద్దే ఉన్న పీహెచ్‌సీ వైద్యాధికారులను పిలిచి మందలించారు. సమయపాలన పాటించకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, చెంగళ వెంకటకిషన్, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, జెడ్పీటీసీ బస్వయ్య, ఉప సర్పంచ్ అక్బర్, సింగిల్‌విండో చైర్మన్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి
Published Wed, Apr 20 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM
Advertisement
Advertisement