మంత్రి లక్ష్మారెడ్డి
నవాబుపేట: నవ తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రభుత్వం చేయూతనంది స్తుందని, క్రీడాకారుల అభివృద్ధికి కృషిచేస్తామని వైద్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఇప్పటూర్ గ్రామంలో ఓపెన్ టు ఆల్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడు తూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు మంచి నడ వ డికను నేర్పిస్తాయన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే అవకాశం క్రీడల వల్ల లభిస్తుందన్నారు. గ్రామీణస్థాయి క్రీడలకు మరింత సహకారం అందిస్తామన్నారు.
ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల మన తెలంగాణ జట్టును ఫైనల్‌లో ఓడించి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నిర్వాహ కులు మొదటి బహుమతి రూ.10 వేలు అందజేశారు. వాలీబాల్ ప్రధాన కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరాదేవి, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సిములు, రవీందర్‌రెడ్డి, అబ్దుల్లా, ప్రతాప్, సర్పంచ్ భూ పాల్‌రెడ్డి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడారంగానికి చేయూత
Published Thu, Feb 19 2015 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement