జాతీయ చేప పిల్లల కేంద్రంలో ఏర్పాటు ఎకో హేచరీ
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎకో హెచరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇంతకు ముందు జాతీయ చేప పిల్లల కేంద్రంలో జార్ హెచనీ ఉండేది. జార్ హేచరీ శిథిలావస్థకు చేరడంతో ముందుగా ఆ హేచరీకి మరమ్మతులు చేపట్టడానికి అధికారులు ఆలోచన చేశారు. కానీ దానికి బదులుగా ఎకో హేచరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణ పనుల్లో భాగంగా రెండు యునిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ. 6 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఒక్కో యూనిట్‌లో ఒక్క రోజులో 20 లక్షల స్పాన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జాతీయ చేప పిల్లల కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం నూతన హేచరీతో ఎక్కువగా చేప పిల్లల ఉత్పత్తి చేపట్టవచ్చని ఫిషరీస్ అధికారులు తెలిపారు. జిల్లాలోని చెరువులకు సరిపడా చేప పిల్లలను ఇక్కడనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేసింది.
ఎకో హేచరీ, జార్ హెచరీకి తేడాలివే..
ఎస్సారెస్పీ చేపపిల్లల కేంద్రంలో ఇది వరకు జార్ హేచరీ ఉంది. జార్ హేచరీకి భవన నిర్మాణం అవసరం ఉంటుంది. జార్ హేచరీ ఒక్క చోటనే ఎప్పటికి ఉండేలా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరమ్మతులు చేపట్టడం అంత సులువు కాదు. ఎకో హెచరీకి భవన నిర్మాణం అవసరం లేదు. అంతే కాకుండా ఒక్క చోటనే పర్మినెంట్‌గా నిర్మిచాల్సి న అవసరం లేదు. పెద్ద పెద్ద చెరువుల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కోసం కూడా ఎకో హేచరీని తరలించవచ్చు. ఎక్కువ సామర్థ్యంలో చేప పిల్ల ల ఉత్పత్తిని చేపట్టవచ్చు. రోజుకు 20 లక్షల స్పాన్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
హేచరీలో ఏం చేస్తారంటే..
తల్లి చేపలను తీసుకువచ్చి ముందుగా పొదుగా వేస్తారు. తల్లి చేపల నుంచి వచ్చిన గుడ్లను తీసి హెచరీలో బాయిల్డ్ చేసి స్పాన్‌ను ఉత్పత్తి చేస్తారు. అలా వచ్చిన స్పాన్ నుంచి చేప ప్లిలలు ఉత్పత్తి అవుతాయి. సగం స్పాన్ నుంచి చేప పిల్లల ఉత్పత్తి కాక ముందే స్పాన్ చనిపోతుంది. స్పాన్ నుంచి వచ్చిన చేప పిల్లలను నీటి కుండీల్లో వేసి దాణా వేస్తూ అంగులంసైజ్ వరకు పెంచుతారు. తరువాత మత్స్యసహకార సంఘాల ద్వారా చెరువుల్లో వదిలేందుకు నూరుశాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment