సంగారెడ్డి మున్సిపాలిటీ : ఉమ్మడి రాష్ర్టంలో ఎక్కువగా నష్టపోయింది మెదక్ జిల్లాయేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండగా మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అడిగేతే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జిల్లాకు చెందినవారు కావడం, తాను ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉండటంతో ప్రాజెక్టులకోసం అధిక నిధులు కేటాయించామన్నారు.
జిల్లాలో 7972 చెరువులు ఉన్నాయని వాటిలో మొదటి విడత మిషన్ కాకతీయ కార్యక్రమంలో 1630 చెరువుల పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెండో విడతలో సైతం 1760 చెరువుల్లో పూడిక తీసేందుకు గాను 230 చెరువులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వెంటనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు సూచించారు. జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు సింగూర్ ఉన్నా ప్రయోజనం లేదని, ఈ ప్రాజెక్టుకు వచ్చే వరద నీటికి అడ్డుగా 44 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించారని దీంతో సింగూర్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఇందుకోసమే సీఎం కేసీఆర్ గోదావరి జాలాలను ఎనిమిది ఎత్తిపోతల ద్వారా సింగూర్‌కు తీసుకవచ్చేందుకు రూ.12 వేల కోట్లు కేటాయించారన్నారు. ఖేడ్ ప్రాంతంలోని పంటల సాగుకోసం గట్టులింగంపల్లి వద్ద 20 వేల ఎకరాలకు సాగునీరందిచేందుకు గాను ఒక ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. గోదావరిలో 200 టీఎంసీల నీరు వృధాగా కలుస్తున్నాయని అందుకు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గణపూర్ అయకట్ట ఎత్తు పెంచేందుకు ఇప్పటికే నిధులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయని, నల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధికి రూ.17 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అవసరమైన చోట లిఫ్టులను నిర్మించేలా మధుర కన్సల్టెంట్ ప్రతిపాదనలు చేయలేదని, వాటిని పూర్తిగా మార్చి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల సూచనల మేరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖలో రైతులకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని స్వాహా చేసిన విషయమై పత్రికల్లో వార్తలు వచ్చినా స్పందించకపోతే ఎలా అంటూ కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ నివేదికను ఇన్‌చార్జి జేడీ కరుణకర్ రెడ్డి వివరిస్తుండగా శ్రీనివాస్‌రెడ్డి రైతుల సొమ్మును మింగిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ వర్షిణి వివరణ ఇస్తూ ఇప్పటికే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో జిన్నారం జెడ్పీటీసీ మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనులు ఎలా ఉన్నా చెరువులు కుంటలు కబ్జాకు గురవుతున్నాయని, ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదనగా కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్పందిస్తూ ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణలను కూల్చి వేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యే పి.బాబూమోహన్, మహిపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి పాల్గొన్నారు.
పీఎంకేఎస్‌వై ప్రణాళికలు తప్పుడ తడక
జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల తయారీపై రూపొందించిన ప్రణాళికలు తప్పుల తడకగా ఉండటంతో సంబంధిత కన్సల్టెంట్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందు మధుర కన్సల్టెంట్ సంస్థ వారు పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన) కింద జిల్లాలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రణాళికలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగు నీరు ఇస్తున్నాం..దీంతో పాటు పెద్దశంకరంపేటలో సైతం సాగు నీరు ఇస్తున్నా అక్కడి చిన్నతరహా ప్రాజెక్టుల పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2948 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు లెక్కలు చూపారని అది వాస్తవం కాదన్నా
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సన్మానం
ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఖేడ్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.భూపాల్‌రెడ్డిని జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముందు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జెడ్పీ సీఈఓ వర్షిణి సన్మానం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు తీరని అన్యాయం
Published Sun, Feb 21 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM
Advertisement
Advertisement