ముంపు ప్రాంతాల కోసం దశలవారీ ఆందోళన | Step-by-step concern for caved areas | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల కోసం దశలవారీ ఆందోళన

Published Sat, May 24 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

Step-by-step concern for caved areas

 భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ :  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ల నుంచి వేరు చేయాలని చూస్తున్న ఏడు మండలాలను తమ ప్రాణం పోయినా వదులుకునేది లేదని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. భద్రాచలంలోని రెడ్‌క్రాస్ బిల్డిం గ్‌లో  సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పోలవరం నిర్మాణంతో ఆదివాసీలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని, దీనిని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

 ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా జిల్లా తో అనుబంధం ఉన్న భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లోని ఆదివాసీలను, ప్రజలను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునేది లేదన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ఆంధ్రకు చెందిన అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయని,  అంత కంటే ఎక్కువగా తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులంతా ఐక్యంగా ఉద్యమించి ముంపు మండలాల ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నదితో పాటు ఏజెన్సీ సంపదను దోచుకునేందుకు ఆం ధ్రావారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముంపు ప్రాంతాలను కాపాడుకునేలా అఖిలపక్షం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు.

ఈనెల 30న ముంపునకు గురయ్యే ఏడు మండలాల్లో బంద్ పాటించాలని, 31, జూన్ 1 తేదీలలో అయా మండలాలలో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని, 2న ముంపు గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఎదుట నల్లజెండాలు ఎగురవేయాలని, అనంతరం సరిహద్దులను ది గ్బంధించాలని నిర్ణయించారు. సదస్సులో న్యూ డెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, కల్పన, బిక్షం, నాగన్న, సీపీఎం నాయకు లు ఏజే రమేష్, కాంగ్రెస్ నాయకులు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, టీడీపీ నాయకురాలు కొమరం ఫణీశ్వరమ్మ, సీపీఐ నాయకులు తమ్మళ్ల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నుంచి తిప్పన సిద్దులు, ఎండీ రఫీ, బీ జేపి నుంచి ఆవుల సుబ్బారావు, ఏవీఎస్‌పీ నుం చి సోందె వీరయ్య, ఏఎస్‌పీ నాయకులు గుండు శరత్‌బాబు, ఆదివాసీ సేన నాయకులు  లక్ష్మణ్‌రావు, ఏపీటీఎఫ్ నుంచి రామాచారి, టీఎన్‌జీవోస్ నాయకులు  నాగేశ్వరరావు, మాలమహానాడు నాయకులు  శేఖర్, ఎంఎస్‌ఎఫ్ నా యకులు అలవాల రాజా, పోలవరం వ్యతిరేక కమీటీ నాయకులు  నారాయణ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement