జనగామలోని చంపక్‌హిల్స్ ప్రధాన మలుపు వద్ద వేసిన స్టాప్‌లైన్లు
జనగామ: జాతీయ రహదారితో పాటు రాష్ట్ర హైవేపై ప్రమాదాలను నివారించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్–వరంగల్ నేషనల్ హైవేతో పాటు సిద్ధిపేట–విజయవాడ రహదారిలోని ప్రధాన కూడళ్ల వద్ద స్టాప్ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ లైన్లు వేగంగా దూసుకొచ్చే వాహనాలను నియంత్రించేందుకు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంతో పాటు హైవేలపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి.
దీనికి ప్రధాన కారణం వాహనాలు అతివేగంగా రావడమేనని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నేషనల్ హైవే అధికారులతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీపీ మల్లారెడ్డి.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రమాదకర కూడళ్లను తెలియజేస్తూ చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై స్పీడు బ్రేకర్లను వేసేందుకు నిబంధనలు అడ్డురావ డంతో.. స్టాప్‌లైన్లను వేయిస్తున్నారు.
ఇంచు ఎత్తులో ఉండే ఈ స్టాప్‌లైన్లు వరుసగా ఏడు నుంచి ఎనిమిది వేయడంతో.. వేగంగా వచ్చే వాహనాల స్పీడ్‌ను కంట్రోలు చేస్తున్నాయి. స్టాప్ లైన్‌పై వెళ్లే క్రమంలో కుదుపునకు లోనవుతుండడంతో.. డ్రైవర్లు బ్రేకులు వేయడం పరి పాటిగా మారిపోతుంది. ప్రమాదాలను వందశాతం నియంత్రించ లేకపోయినప్పటికీ, ఎంతో కొంత మేర వేగం తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అతి ప్రమాదకరమైన ప్రదేశాల్లో పది లైన్లు, ఇతర చోట్ల ఎనిమిది వరకు ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లా పరిధిలోని హైదరాబాద్ రోడ్డు, ఆర్టీసీ చౌరస్తాతో పాటు అంబేడ్కర్ సెంటర్, నెహ్రూపార్కు, ఫ్లై ఓవర్, చంపక్ హిల్స్ ప్రధాన మలుపులు, మాతాశిశు ఆరోగ్య కేంద్రం తదితర పాంతాల్లో స్టాప్ లైన్ ఏర్పాటు చేశారు. స్టాప్‌లైన్‌తో వేగ నియంత్రణ
రోడ్డు ప్రమాదాల నివారణకు వేసిన స్టాప్‌లైన్లు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి.
ఒక్క సారిగా కుదుపునకు లోనయ్యే అవకాశం ఉండడంతో.. డ్రైవర్లు వేగాన్ని అదుపు చేసుకుంటున్నారు. ఇలా చేయడంతో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువయ్యే అవకాశం ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రమాద ప్రదేశాలను గుర్తించి, వాహన డ్రైవర్లతో పాటు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. –శ్రీనివాస్, ఎస్సై, జనగామ
Comments
Please login to add a commentAdd a comment