
సాక్షి, సూర్యాపేట : పట్టణంలోని సూర్యాపేట-జనగామ క్రాస్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బైక్‌ని ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కుడకుడ గ్రామానికి చెందిన సాయి, వినయ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.