ఆదిలాబాద్ రిమ్స్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు గురువారం ఒక్కరోజు సమ్మెకు దిగారు. జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ నాన్ ఎగ్జిక్యూటీవ్ యూనియన్ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమ్మె చేపట్టారు. కమిటీ కార్యదర్శులు సుభాష్ నరేందర్ మాట్లాడుతూ రెగ్యులర్ మజ్ధూర్, గ్రూప్-డి తదితర కేడర్లలో ఏర్పడిన స్టాగ్నేషన్‌పే 2007 నుంచి నియమించిన ఉద్యోగులు, అంతకుముందు ఉన్న ఉద్యోగుల వేతన వ్యత్యాసాన్ని సవరించాలన్నారు.
బోనస్ చెల్లింపులకు ఒప్పందం కుదుర్చుకోవాలని, ఎల్‌టీసీ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ అలవెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టెలికాం ఫ్యాక్టరీలను పునరుద్ధరించి, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులతోనే కాల్‌సెంటర్లు నిర్వహించాలని కోరారు. ఇలా ఎన్నో సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు విలాస్, అంజన్‌గౌడ్, సోమయాజులు, రవి, ఎంఏ గని, సయ్యద్ అజార్‌షా, తదితరులు పాల్గొన్నారు.
మొండివైఖరి వల్లే ఉద్యోగుల్లో ఆందోళన
మంచిర్యాల సిటీ : యాజమాన్యం మొండివైఖరి వ ల్ల సమస్యలు పరిష్కారం కాక బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఆ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మంచిర్యాలలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో మాట్లాడారు. గతంలో అనేక ఆందోళన చేసినా యాజమాన్యం స్పందించలేదన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి బాలవెంటకరెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, లక్ష్మీనారాయణ, రుబీన్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె
Published Fri, Nov 28 2014 2:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement