వరంగల్ : రైలు కింద పడి విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్‌లోని సంతోషి మాత గుడి దగ్గర్లోని రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. మొగుళ్లపల్లి మండలానికి చెందిన అసంపల్లి పృధ్వీన్ (23) అనే యువకుడు శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొవడానికి కారణాలు తెలియరాలేదు. అతని జేబులో ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా అతన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. మృతుడు అంబెద్కర్ యూనివర్సిటీలో ఓపెన్‌డిగ్రీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఎంజీఎమ్ ఆస్పత్రికి తరలించారు.
(మట్టెవాడ)