
వర్షిణి.. సాహసాధికారిణి!
ఆమె ఓ మహిళా ఉన్నతాధికారి.. సాహసానికి మారుపేరుగా నిలిచారు
తాండూరు రూరల్ (రంగారెడ్డి): ఆమె ఓ మహిళా ఉన్నతాధికారి.. సాహసానికి మారుపేరుగా నిలిచారు. ఇసుకాసురుల పనిపట్టేందుకు ఆ అధికారిణి బైక్‌పై వెళ్లారు. 150 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి ఇలా బైక్‌పై వెళ్లారు. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. - తాండూరు రూరల్