పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి...
* టీఎస్‌యూటీఎఫ్‌కు కమల్‌నాథన్ హామీ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, సర్దుబాటు చేస్తామని ఉద్యోగుల విభజన సలహా కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావ రవి, ఎం.ఎ.కె. దత్తు తెలిపారు వీరు సోమవారం సచివాలయంలో కమల్‌నాథన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
ముంపు ప్రాంత ఉద్యోగులను ఖమ్మం జిల్లాలోనే సర్దుబాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై కమల్‌నాథన్ స్పందిస్తూ ముంపు ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని, అయితే తెలంగాణలోకి వచ్చే వారికోసం సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపి అనుమతి తీసుకోవాలని కమల్‌నాథన్ చెప్పారని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు తెలిపారు. 17న నిర్వహించే కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారని వారు తెలిపారు.