అనర్హులకు ఆసరా | Support is not eligible | Sakshi
Sakshi News home page

అనర్హులకు ఆసరా

Published Wed, Jan 14 2015 3:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

అనర్హులకు ఆసరా - Sakshi

అనర్హులకు ఆసరా

ఇదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణవేణి భర్త లింగయ్య పుట్టుకతోనే మూగ. చిన్న గుడిసె తప్ప మరే ఆస్తిపాస్తుల్లేని నిరుపేద కుటుంబం. లింగయ్య మిషన్ కుట్టి సంపాదిస్తేనే కుటుంబ గడిచేది. గత కొన్నేళ్లుగా లింగయ్యకు పింఛన్ వస్తుండగా, ప్రస్తుతం ఆగిపోయింది. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే నాథుడేలేరు.
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో ఆసరా పథకం అభాసుపాలవుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి? అర్హులైన వారు చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా పింఛన్ ఇవ్వని అధికారులు... అన్ని ఆస్తుపాస్తులుండీ, ఎలాంటి వైకల్యంలేని శ్రీమంతులకు మాత్రం డబ్బులిస్తే చాలు.. ఇంటికొచ్చి మరీ పింఛన్ అందించి వెళుతున్నారు. ఇందుకు నిదర్శనం కాటారం మండలం గంగారం గ్రామం.

ఈ పంచాయతీ పరిధిలో అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారంటూ అందిన సమాచారంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. గ్రామంలో ఎంతమందికి పింఛన్లు మంజూ రు చేశారనే జాబితాను సంపాదించి అందులోని అర్హులెందరు? అనర్హులెందరు? అనే అంశాలను లోతుగా పరిశీలించింది. ఆ జా బితాలో పేర్కొన్క వారి ఇళ్లకు వెళ్లి వారి ఆర్థిక, వైకల్య పరిస్థితులను తెలుసుకునే క్రమంలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.
 
గంగారం గ్రామంలో మొత్తం 400 మందికిపైగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 382 మందిని అర్హులుగా ప్రకటిస్తూ జాబితా రూపొందించారు. మార్గదర్శకాలను అనుసరిస్తే ఈ జాబితాలో అతి కొద్దిమంది మాత్రమే పింఛన్లకు అర్హులని తేలింది. 350 మంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లకు అనర్హులు. కొందరైతే తమకు వైకల్యం లేకున్నా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సంపాదించి వికలాంగుల కోటాలో అర్హత సంపాదించడం విశేషం.
 
నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండీ... తినడానికి తిండి కూడా లేని నిర్భాగ్యులు ఇదే ఊరిలో ఉన్నారు. వాళ్లు పింఛన్ ఇవ్వండి మహాప్రభో అంటూ దరఖాస్తు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవుయ్యారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణవేణి భర్త లింగయ్య పుట్టుకతోనే మూగ. చిన్న గుడిసె తప్ప మరే ఆస్తిపాస్తుల్లేని నిరుపేద కుటుంబం. లింగయ్య మిషన్ కుట్టి సంపాదిస్తేనే కుటుంబం గడిచేది. కొన్నేళ్లుగా లింగయ్యకు పింఛన్ వస్తుండగా, ప్రస్తుతం ఆగిపోయింది. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే నాథుడే లేరు.

ఇదే గ్రామానికి చెందిన బండారి రాజయ్య కొడుకు శంకర్ చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగుడు. నిరుపేద కుటుంబానికి పూట గడవడమే నానా కష్టం. మొన్నటి వరకు శంకర్‌కు ఫింఛన్ ఇచ్చేవారు. ఆసరా కోసం నాలుగైదుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ రావడం లేదు. కొడుకును తీసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేనాథుడే  లేరు.
 
జిల్లాలో సగానికి పైగా అక్రమాలే!
ఆసరా పథకంలో అక్రమాలు గంగారం గ్రామానికే పరిమితం కాలేదు. అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఏవిధంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారడానికి గంగారం ఒక ఉదాహరణ మాత్ర మే. జిల్లావాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛ న్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 3,65,815 మందిని అర్హులుగా ప్రకటించారు. అధికారులు ఆమోదించిన జాబితాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలిస్తే సగం మంది పింఛన్లకు అనర్హులే.

స్థానిక ప్రజాప్రతినిధుల పైరవీలు, అధికార పార్టీ నేతల అండతోపాటు అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పడం ద్వారా అనర్హులైన వారు సైతం పింఛన్లకు అర్హత సాధించారు. వికలాంగులకు నెలకు రూ.1500 ఇస్తుండటం తో వైకల్యం లేని వాళ్లు కూడా అధికారులకు డబ్బులు ముట్టజెప్పి సదరెం సర్టిఫికెట్లు సంపాదించి వికలాంగులకు దక్కాల్సిన పింఛన్లు పొందుతున్నారు. అట్లాగే నూటికి నూరుశాతం వైకల్యం ఉండి, బతుకుదెరువు కష్టమైన నిర్భాగ్యులకు మాత్రం నేటికీ పింఛన్లు మంజూరు కాకపోవడం బాధాకరం.

వీరంతా ప్రతిరోజు తమకు పింఛన్లు ఇప్పించండి మహాప్రభో అంటూ జిల్లా ప్రభుత్వాసుపత్రి, మండల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారం వారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమగోడు వెళ్లబోసుకుంటున్నా ఫలితం కన్పించకపోవడంతో దిక్కుతోచక బతుకు నెట్టుకొస్తున్నారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం... పింఛన్ పొందడానికి అన్ని అర్హతలున్న వారు జిల్లాలో సుమారు 25 వేల మందికిపైగా ఉన్నట్లు అంచనా. స్థానిక ప్రజాప్రతినిధుల అండలేకపోవడం, అధికారులను ‘సంతృప్తి’ పర్చకపోవడం వంటి అంశాలతోపాటు చిన్న చిన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపి పింఛన్లు ఇవ్వకుండా తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
 
 ్చఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి బేజారైనం
 నా పేరు దాసరి కృష్ణవేణి. నాభర్త పేరు లింగయ్య. ఆయన పుట్టుకతోనే మూగ. మేము చాలా పేదోళ్లం. ఉండటానికి చిన్న గుడిసె తప్ప ఏమి లేదు. మాకు ఒక కూతురు, కొడుకు. నా భర్త మిషన్ కుట్టి సంపాదిస్తేనే గడుత్తది. సానా ఏళ్ల నుంచి ఫించన్ అత్తంది. మొన్న కొత్త పింఛన్లు అచ్చిన కాడినుంచి మా ఆయన ఫించన్ బంద్ అయింది. మూడుసార్ల దరఖాస్తు చేసుకున్నం. ఆఖరికి మూగాయిన అని సర్టిఫికెట్ తెచ్చుకొమ్మన్నరు. డాక్టర్ల దగ్గరకు పోతే నీవు మూగోనివి కాదు పో అన్నరు. పైసలు ఇత్తే సర్టిఫెకెట్ ఇస్తా అన్నారు. ఆళ్ల ఈళ్ల కాళ్లమీద పడి సర్టిఫికెట్ తెచ్చుకున్నం. పుట్టు మూగ అని ఊరోళ్లందరికీ తెలుసు. కానీ అధికారులకు మాత్రం కాయితం ఉంటనే తెలుస్తదట. మూడు నెల్ల పెంచన్ రాకా ఇబ్బందిపడుతున్నం.

సర్టిఫికెట్ ఉన్న పెన్షన్ ఇస్తలేరు
నా పేరు బండారి రాజయ్య. మాది కాటారం మండలం గంగారం. నా కొడుకు పేరు శంకర్. ముప్పై ఏండ్లుంటయ్. చిన్నప్పటి నుంచి మానసిక వికలాంగుడు. చాలా ఏళ్ల నుంచి పింఛన్ అత్తంది. ఈ మూడు నెలల నుంచి పింఛన్ ఇత్తలేరు. మానసిక వికలాంగుడు అని సర్టిఫికెట్ తెచ్చుకోమంటే తెచ్చుకున్న. నాలుగు సార్ల దరఖాస్తు చేసిన కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరు. నేను ముసలోన్ని. ఎప్పటికి తిరగాలంటే చేతనైతలేదు. ముంద ట ఉన్న మనిషి కాదని అధికారులు కాయితాన్ని నమ్ముతరట. నా భార్య, నేను ఇద్దరం ముసలోల్లమే. మాది మాకు పూట గడుసుడే తిప్పలైతంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement