జోగు రామన్న
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిమ్మ సంతోష్ సోమవారం ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామన్న ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు సంతోష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు వర్గాల్లోని కార్యకర్తల మధ్య ప్రజలకు సేవ చేయలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన సుజాత ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో చెప్పాలని పేర్కొన్నారు.
జైనథ్: నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టికి ప్రజలు పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న సతీమణీ జోగు రమాదేవి అన్నారు. సోమవారం ఆమె ఎంపీపీ తల్లెల శోభ, ఇతర నాయకులతో కలిసి మండలంలోని బాలాపూర్, సాంగ్వి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ..కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్నను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్, నాయకులు తల్లెల చంద్రయ్య, తమ్మడి భగవాండ్లు, మద్దుల ఊషన్న, గుమ్ముల సునీల్, వైద్య ఉమేష్, జక్కుల వినోద్, అల్లకొండ అశోక్, దుర్ల నడిపెన్న, సురేందర్ రెడ్డి, విలాస్ తదితరులు పాల్గొన్నారు.
జైనథ్: మండలంలోని ఆనంద్‌పూర్, కూర గ్రామాల్లో టీఅర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం వారు ఇంటింటికీ తిరుగుతూ..కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్నను ఎమ్మేల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జోగు ప్రేమేందర్, పెందూర్ దేవన్న, అడప తిరుపతి, రవీందర్, స్వామి రెడ్డి, చందర్, దుర్ల అశోక్, రాంరెడ్డి, యాసం నర్సింగ్, గంగన్న, సోమ రమేష్‌రెడ్డి, రినేష్, వామన్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్: ఢిల్లీ, అమరావతిలో అధిష్టానం ఉండే పార్టీల కంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మావల మండలంలోని దుర్గనగర్, దస్నాపూర్ కాలనీల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ జన్‌ధన్ జీరో అకౌంట్‌ల పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆయన ఇంటి ముందు వేసిన రోడ్డు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేయకపోతే బీజేపీ ప్రభుత్వం వేసిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మావల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, నాయకులు రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment