చైతన్యపురి: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెం దింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు అంటుం డగా..., భర్త, అత్త, ఆడపడుచులు, ఎస్‌ఐగా పనిచేస్తున్న ఆ ఇంటి అల్లుడి వేధింపులతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థాని కులు, మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకా రం... వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చట్ల నర్సయ్య, అనసూయ దంపతుల కుమార్తె లలిత(24) ఎమ్మెస్సీ పూర్తి చేసింది.
ఈమెకు గతేడాది ఫిబ్రవరి 9న నల్లగొండ జిల్లాకు చెందిన అక్కినపల్లి సుమన్(29)తో పెళ్లైంది. వివాహ సమయంలో రూ. 10 లక్షలు, బంగారం, ఫ్లాట్ కట్నంగా ఇచ్చారు. సుమ న్ వికారాబాద్‌లో అటవీశాఖలో ఎఫ్‌ఎస్‌ఓగా పని చేస్తున్నా డు. మారుతినగర్ సత్యానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. సుమన్ తల్లి రామలింగమ్మ, సోదరి చైతన్య వీరి వద్దే ఉంటున్నారు. పెళ్లైన దగ్గర నుంచి సూటిపోటి మాటలతో లలితను భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తున్నారు. ఇటీవలే పదోన్నతి వచ్చిన సుమన్ అదనపు కట్నం కావాలని లలితను వేధిస్తున్నాడు. నెలరోజుల క్రితం లలి తపై చేయి చేసుకోవటంతో గాయపడింది.
విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్ చేసిన పోలీ సులు రాజీ కుదిర్చి పంపించారు. వారం రోజులు లలితను తమ వెంట తీసుకెళ్లి తిరిగి 15 రోజుల క్రితం భర్త వద్ద వదిలి వెళ్లారు. ఆసమయంలో కూడా ఇరు కుటుంబాల మధ్య గొ డవ జరిగింది. లలిత వద్ద సెల్‌ఫోన్ లేకపోతేనే కాపురం చేస్తానని, లేదంటే మళ్లీ తిరిగి పంపివేస్తానని సుమన్ షరతు పెట్టాడు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా పక్కింటి వారిని కూడా ఫోన్ ఇవ్వవద్దని సుమన్ బెదిరించాడు. ఇదిలా ఉం డగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లలిత అనుమానాస్పదస్థితిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెంది ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త సుమన్, అ త్త రామలింగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వేధింపుల వల్లే చనిపోయింది: తల్లిదండ్రులు
లలిత ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు నర్సయ్య, అనసూయ హుటాహుటిన నగరానికి వచ్చారు. లలిత మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు. పెళ్లైనప్పటి నుంచీ రకరకాలుగా వేధించటం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు. ప్రమోషన్ వచ్చింది... ఇల్లు కొనుగోలు చేయటానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పినట్టు వారు ఆరోపించారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఎస్‌ఐ అండ చూసుకునే....
సుమన్ బావ వసంత్‌కుమార్ అల్వాల్‌లో ఎస్‌ఐగా పని చే స్తున్నాడని, అతని అండ చూసుకునే తమను నానా రకాలు గా ఇబ్బందులు పెట్టారని లలిత తల్లిదండ్రులు ఆరోపిం చారు. మహిళా పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా తమను వసంత్‌కుమార్ బెదిరించాడని...మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నాడని వారు తెలిపారు. కాలనీ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో కూడా తమను బెది రించాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
గృహిణిని బలితీసుకున్న వేధింపులు
Published Thu, Feb 19 2015 11:44 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM
Advertisement