ఉద్యమంలా ‘స్వచ్ఛ భారత్’
ఖమ్మం జెడ్పీసెంటర్ : దేశ పరిశుభ్రతకు ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేపట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ పేరు తో ప్రధాని బృహత్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలన్నారు. జిల్లా వ్యాపంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టేలా ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
చీపురుపట్టి...
చైర్‌పర్సన్ కవిత చీపురు పట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణాన్ని శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొని ఉత్సాహంగా పరసరాలను శుభ్రం చేశారు. తొలుత జాతిపిత మహ్మతాగాంధీ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ఉద్యోగులతో ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కర్నాటి రాజేశ్వరి, డీఈలు నవీన్, సుధాకర్‌రెడ్డి, మహేష్, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, నాయకులు రవీంద్రప్రసాద్, శ్రీనివాస్, సక్రియ, శంకర్, వాణిశ్రీ, వంశీ, దినేష్, మధు, రామకృష్ణరెడ్డి, చింపలరాజు, సుబ్రమణ్యం, నర్సింహరావు, కాశయ్య, చక్రపాణి పాల్గొన్నారు.