ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న స్వైన్ఫ్లూ ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.
ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న స్వైన్ఫ్లూ ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు తెలిపారు. శరీరంలోనే ఉండే వ్యాధి నిరోధకాలు స్వైన్ ఫ్లూను ఎదుర్కొంటాయని నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు బుధవారం చెప్పారు.స్వైన్ఫ్లూ వ్యాధికి ప్రత్యేక చికిత్స, టీకా ఏదీ అవసరం లేదని వారు తెలిపారు.
శీతాకాలంలో వచ్చే వైరస్ స్వైన్ఫ్లూ అని... ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి వైరసే ఉందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని వైద్యులు అన్నారు.