రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రునాయక్
గుండాల : కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి టి.రామచంద్రునాయక్ అన్నారు. మండల కేంద్ర ంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రునాయక్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారుల సహకారంతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఓర్వలేని పార్టీలు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
రానున్న నాలుగేళ్లలో ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కాగా, రామచంద్రునాయక్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 20 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోపగాని శంకరావు, పినపాక నియోజకవర్గ ఇన్‌చార్జి పొడియం న రేంద్రకుమార్, మండల అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌బాబు, గొల్లపల్లి రమేష్, నాయకులు తాళ్లపల్లి శ్రీను, అంజద్, ఫయూం, సుద ర్శన్, నాగేశ్వరావు, లక్ష్మీనారాయణ, మొక్క వెంకన్న, రాజు, అజ్జు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
గుండాల : ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రామచంద్రునాయక్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రహదారులను త్వరగా పూర్తి చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనంతరం ఇల్లందు-గుండాల రోడ్డును పరిశీలించారు. గురకుల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్, తహశీల్దార్ హరిచంద్, ఎంపీడీవో నవీన్‌కుమార్, సర్పంచ్‌లు శాంతయ్య, చ ంద్రయ్య, ఉప సర్పంచ్ ఖయ్యూం, ఎంపీటీసీ బచ్చల రామయ్య, సుజాత, మెస్సు సమ్మక్క, పీఏసీఎస్ అధ్యక్షుడు యాసారపు వెంకన్న, వివిధ శాఖ ఏఈలు పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Fri, Aug 14 2015 3:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM