
బంగారు తెలంగాణే లక్ష్యం
- మేనిఫెస్టోలోని వాగ్ధానాలు నెరవేరుస్తాం
- రుణమాఫీ ఇంకా ఖరారు కాలేదు
- ఎంపీ గోడం నగేశ్
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : బంగారు తెలంగాణే ల క్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ దిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా శని వారం మండల కేంద్రానికి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ స్థానిక అంబేద్కర్, కొ మురం భీమ్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా బం గారు తెలంగాణ సాధిస్తామని చెప్పారు.
ముం దుగా ప్రకటించినట్లుగానే రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాఫీ చేస్తారని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయంకాలేదని, రైతులు అపోహపడొద్దని కోరా రు. మే నిఫెస్టోలో పేర్కొన్న అన్ని వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.
ఘనస్వాగతం
నేరడిగొండ మండలంలోని టోల్‌ప్లాజా వద్ద ఎంపీ నగేశ్‌కు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇచ్చోడ మండల కేంద్రం వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ గాడ్గే సుభాష్, నాయకులు కృష్ణకుమార్, కృష్ణారెడ్డి, శివరాం, గంగాధర్, పాండు, జీవీ.రమణ పాల్గొన్నారు.