![పౌరహక్కుల కోసం ఉద్యమించండి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61447024573_625x300.jpg.webp?itok=x9o-mk7D)
పౌరహక్కుల కోసం ఉద్యమించండి
అంబేడ్కర్ మనవడు ప్రొఫెసర్ ఆనంద్‌తేల్ తుంబ్డే
షాద్‌నగర్ రూరల్: పౌర హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అంబేడ్కర్ మనవడు ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రాజ్యహింస, మతోన్మాదుల అరాచకాలు, దళితులు, ప్రజాస్వామిక వాదులపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన పౌరహక్కుల సంఘం జిల్లా 12వ మహాసభలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పౌర, ప్రజాస్వామిక హక్కులకు రక్షణ ఉంటుందని, ఎన్‌కౌంటర్లు, నిర్బంధాలు ఉండవని ఆశించామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లతో విరుచుకుపడుతుందని ధ్వజమెత్తారు.
పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహాసభల్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, సహాయకార్యదర్శి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.