నల్లగొండ : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సోమవారం ప్రకటించనున్నారు.షెడ్యూల్ ప్రకారం పాఠశాలల్లో 1,2,3,4 కేటగిరీల వారీగా తాత్కాలిక ఖాళీల వివరాలను కలెక్టర్ ఆమోదంతో సోమవారం డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పోస్టుల ఖాళీల వివరాలు ప్రకటించిన నాటి నుంచి 27 తేదీ వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవుతుంది. విద్యాశాఖ నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు...అన్ని కేటగిరీల్లో కలిపి 1800 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. దీంట్లో ఎస్‌జీటీ 12 వందలు పోస్టులు కాగా...స్కూల్ అసిస్టెంట్లు, పండిట్లు కలిపి 8 వందల వరకు ఉన్నాయి.
అలాగే కౌన్సెలింగ్ నిబంధనల మేరకు ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న హెచ్‌ఎంలు 233, ఎనిమిదేళ్ల సర్వీసు దాటిన వారు 322 మంది ఉన్నారు. వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీల వివరాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇదిలావుంటే రేషనలైజేషన్ ద్వారా గుర్తించిన రెండు వేల మిగులు పోస్టులను ఏ విధంగా సర్దుబాటు చేయాలనే దానిపై డైరక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. 30 మంది ఉపాధ్యాయులకు ఒక్కరే ఉపాధ్యాయుడు అనే నిబంధనపై ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఉన్నతస్థాయి అధికారులు పునరాలోచలనో పడ్డా రు. శనివారం డీఈఓలతో డైరక్టర్ స్థాయిలో సమావేశం జరిగింది. సోమవారం అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకా రం రేషనలైజేషన్ పోస్టులను సర్దుబాటు చేస్తారు.
ఎన్నికల కోడ్ అడ్డంకి...?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన పక్షంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ భావిస్తోంది. శనివారం డైరక్టర్ స్థాయిలో జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తుంది. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా..?లేదా..? అనేదానిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
నేడు ఉపాధ్యాయ ఖాళీల ప్రకటన
Published Mon, Jun 22 2015 12:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement