ఉద్యానవన అధికారులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ఉద్యానవన అధికారులపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ సబ్సిడీలను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని మంత్రి అన్నారు.
నిబంధనల పేరుతో అధికారులు రైతులను వేధిస్తున్నారని, ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు సడలించిన విషయం కూడా అధికారులకు తెలియకపోవడం బాధాకరమైన విషయమని మంత్రి పోచారం అన్నారు. ఉద్యానవన అవగాహన సదస్సులో భాగంగా అధికారులు తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు.