హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సోమవారం మధ్యాహ్నం అరగంట వాయిదా పడింది. ఏపీఐఐసీ భూముల వ్యవహారంపై సభలో చర్చించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వగా, సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ మధుసూదనా చారి సభను అరగంట వాయిదా వేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భూముల వ్యవహారం గురించి సభలో మాట్లాడారు.