హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి బుధవారం సాయంత్రం ఆరుగంటలకు సమావేశం కానుంది. ఓటుకు నోటు వ్యవహారంలో తాజా పరిస్థితులపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ తీర్మానాలకు తెలంగాణ మంత్రిమండలి కౌంటర్ సిద్ధం చేయనుంది. హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్ అధికారాల విషయాన్ని కేబినెట్లో చర్చించనున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, పాలమూరు ఎత్తిపోతలు, నిరుద్యోగ యవత రిక్రూట్మెంట్ల విషయాలను కేబినెట్ సమావేశంలో ప్రస్థావించనున్నారు. నిరుద్యోగ యవతకు వయోపరిమితి సడలింపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్లపై కేబినెట్లో చర్చించనున్నారు.