గోనె సంచుల కొరతకు చెక్‌!  | Telangana Civil Supplies Department Arrange Gunny Bags | Sakshi
Sakshi News home page

గోనె సంచుల కొరతకు చెక్‌! 

Published Wed, Apr 15 2020 10:44 AM | Last Updated on Wed, Apr 15 2020 10:44 AM

Telangana Civil Supplies Department Arrange Gunny Bags - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల కొరతకు ఇక్కట్లు లేకుండా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మిల్లర్లు, డీలర్ల నుంచి 3 కోట్ల సంచులు, కాంట్రాక్టర్ల నుంచి మరో 5 కోట్ల వరకు సంచులు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం వద్ద ఇప్పటికే 8 కోట్ల గోనె సంచులు లభ్యతగా ఉండటంతో ధాన్యం సేకరణకు అడ్డంకులు తొలిగినట్లే. ఈ వారం నుంచి కొనుగోళ్లు మరింత ముమ్మరం కానున్న నేపథ్యంలో.. మొత్తం కొనుగోళ్లకు 20 కోట్ల సంచులు అవసరముండగా, తక్షణం 7 కోట్ల సంచుల వరకు అవసరం ఉంటుందని అంచనా వేశారు.

ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మిల్లర్ల వద్ద నుంచి కనీసంగా 3 కోట్ల గోనె సంచులు సేకరించేలా లక్ష్యం పెట్టుకుంది. దీనికి ఒక్కో సంచికి రూ.18 చెల్లించేందుకు సిద్ధ్దమైంది. మిల్లర్ల నుంచి సైతం 3 కోట్లు సంచులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వీరినుంచి కనీసంగా మరో 1.50 కోట్ల సంచులు వస్తాయని అంచనా వేశారు. మొత్తంగా మిల్లర్లు, డీలర్లు, కాంట్రాక్టర్ల నుంచే 8 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. రాష్ట్రం వద్ద సైతం మరో 8 కోట్ల వరకు గోనె సంచులు లభ్యతగా ఉన్నాయి. వీటితో ఈ ఏడాది సీజన్‌ను గట్టెక్కించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement