సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన | telangana cm kcr announces to credit 4 thousand rupees in every farmer account per acre | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Published Thu, Apr 13 2017 4:30 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన - Sakshi

సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

హైదరాబాద్: రైతు రుణాల మాఫీ ఎన్నికల హామీని నెరవేర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి రైతులకు వరాలు కురిపిస్తూ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వందశాతం ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలని, మే 30 లోపు ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతుల ఎకౌంట్‌లో వేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

గురువారం ప్రగతి భవన్‌లో రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణాలను (రూ.లక్ష లోపు) పూర్తిగా మాఫీ చేసినందుకు రైతులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామని చెప్పారు. తెలంగాణలో ఇక నుంచి విద్యుత్ కోతలు ఉండవని చెప్పారు. మూడు, నాలుగేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తామన్నారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌కు నీళ్లు మళ్లిస్తామని కేసీఆర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement