
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, నిధుల శాతం కూడా పెంచాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment