కానిస్టేబుల్ తుదిఫలితాలు విడుదల
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖలో జరిగిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయ్యింది. సివిల్, ఏఆర్, బెటాలియన్స్, ఎస్‌పీఎఫ్, ఫైర్‌మెన్ విభాగాల్లోని 11,281 పోస్టులకు 10,113మంది అభ్యర్థులు ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంచేశారు. వారం రోజుల క్రితమే పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలోని 332పోస్టులకు జరిగిన నియామక ప్రక్రియలో 329మంది ఎంపికయ్యారు.
మొత్తం పోస్టులు 11,613 కాగా, 10,442మంది అభ్యర్థులు ఎంపికయినట్టు ఆయన తెలిపారు. కటాఫ్ మార్కులు, కేటగిరీ వారి ఎంపిక వివరాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పరిశీలించుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని సూచించారు. ఈ నోటిఫికేషన్‌లో సివిల్ విభాగంలో 33శాతం మహిళ రిజర్వేషన్ ద్వారా 637మంది, ఏఆర్ విభాగంలో 10శాతం రిజర్వేషన్ ద్వారా 387మంది, కమ్యూనికేషన్ విభాగంలో 106 మంది అభ్యర్థులు ఎంపికైనట్టు స్పష్టంచేశారు. మొత్తం 1130మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్టు చైర్మన్ పేర్కొన్నారు.
పోస్టులు, ఎంపికైన విభాగాల వారీగా..
విభాగం పోస్టుల ఎంపికైన అభ్యర్థులు
సివిల్ కానిస్టేబుల్ 2108 2102
ఏఆర్ కానిస్టేబుల్ 4462 3346
ఎస్‌ఏఆర్ సీపీఎల్ 56 56
టీఎస్‌ఎస్‌పీ 4065 4029
ఎఫ్‌పీఎఫ్ 174 170
అగ్నిమాపక శాఖ 416 410
కమ్యూనికేషన్ 332 329
మొత్తం 11613 10442