మహేశ్వరం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ పునర్నిమాణం, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకా టీడీపీలో కొనసాగితే ఆత్మవంచన చేసుకున్నట్లేనన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూన యాదయ్య అతని అనుచరులతో కలిసి నగరంలోని మంత్రి నివాసంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్ర పార్టీలకు ఇక కాలం చెల్లిందని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్‌ఎస్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కూన యాదయ్య మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడిన నాయకుడికి తగిన గుర్తింపులేదన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని గ్రహించి పార్టీ మారినట్లు చెప్పారు. కూన యాదయ్యతోపాటు నాయకులు పెద్దమ్మ నర్సింగ్‌రావు, మోహన్ తదితరులు మొత్తం 50 మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సామల రంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రామకృష్ణ తదితరులున్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన దీపామల్లేష్
శంషాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దీపామల్లేష్ గురువారం రాష్ట్ర రవాణాశాఖమంత్రి పి. మహేందర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గతంలో తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దీపామల్లేష్ ఎన్నికలకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆమెతో టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మల్లేష్‌ముదిరాజ్, సరోజిని మహిళా మండలి అధ్యక్షురాలు సునంద, నాయకులు అనసూయ, భార్గవి, ఉమ, విజయలక్ష్మి, జంగయ్య, మైలారం రాములు, లక్ష్మణ్, కృష్ణ, రాజు, శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
Published Fri, Jul 25 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement