తెలంగాణ జెన్‌కో చైర్మన్‌గా ఎస్‌కే జోషి | telangana genco chairman sk joshi | Sakshi
Sakshi News home page

తెలంగాణ జెన్‌కో చైర్మన్‌గా ఎస్‌కే జోషి

Published Thu, May 22 2014 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

telangana genco chairman sk joshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో చైర్మన్‌గా సుశీల్ కుమార్ ఎస్‌కే జోషి ఎంపికయ్యారు. తెలంగాణ జెన్‌కో పాలకమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా జెన్‌కోను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడిన మొదటి కంపెనీ ఇదే కావడం గమనార్హం. తెలంగాణ జెన్‌కోలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు)గా ఉన్న ఎస్‌కే జోషితో పాటు ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, బలరాం, సత్యమూర్తి డెరైక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో బుధవారం సమావేశమైన డెరైక్టర్లు జోషిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అదేవిధంగా తెలంగాణ జెన్‌కోలో 11 మందికి షేర్లను జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement