
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణను వివిధ విభాగాల్లో 5 స్వచ్ఛ్ మహోత్సవ్ పురస్కారాలు వరించాయి. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంలో అవార్డులు ప్రకటించింది. జిల్లాల స్థాయిలో పెద్దపల్లి, వరంగల్, ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమకు అవార్డులు దక్కాయి. ఇక రాష్ట్రాల స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణకు అవార్డు దక్కింది. సోమవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment