ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులో నిర్మిస్తున్న ప్యాకేజీ 6 టన్నెల్ పనులను శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డు కార్యదర్శుల బృందం సందర్శించింది. కృష్ణాబోర్డు మెంబర్ కార్యదర్శి పరమేశం, గోదావరి బోర్డు మెంబర్ కార్యదర్శి డాక్టర్ సమీర్ చటర్జీ ఆధ్వర్యంలో ప్యాకేజీ 6 లోని సర్జిఫూల్, పంపుహౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్, టన్నె ల్ నిర్మాణాలను తిలకించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకట్రాములు ఆధ్వర్యంలో ఏఈ ఉపేందర్ నిర్మాణ వివరాల ప్రయోజనాలు బృందం సభ్యులకు వివరించారు. కార్యదర్శులు చటర్జీ, పరమేశంలు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వా రా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment