రైతు సమస్యలపై తెలంగాణ సర్కార్ భేటీ | telangana government meets over farmers suicide issue | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై తెలంగాణ సర్కార్ భేటీ

Published Wed, Dec 30 2015 4:57 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

telangana government meets over farmers suicide issue

హైదరాబాద్ : రైతులు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలేమిటో తెలుసుకోవాలని హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే ఈ భేటీలో రైతు సంఘం ప్రతినిధులు, తెలంగాణ రైతు జేఏపీతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రైతుల సమస్యపై నిర్వహించిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి రాకపోవడం బాధాకరమన్నారు.

రైతు బాగుంటేనే  రాష్ట్ర ప్రగతితో పాటు రాజకీయ సుస్థిరత, ఆర్థిక ప్రగతి బాగుంటుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రైతుల సమస్యలను తీర్చడమే అజెండాగా ప్రభుత్వం పని చేయాలని కోదండరామ్ సూచించారు. కాగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణాలేమిటో తెలుసుకోవాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. మూలాల్లోకి వెళ్లి వెతికితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement