
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని పేర్కొంది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న ఆదేశాలు అమలు కావడంలో లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ( చదవండి: డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్! )
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్(ఏజీ) మాట్లాడుతూ..గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందని వివరించారు. సుప్రీం కోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందేని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడంలేదని ప్రభుత్వంపై ఆసహనం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా వైరస్ సోకిందని తెలిపింది. మీడియా బులెటెన్‌లో తప్పడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ నెల 18లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment