సాక్షి, హైదరాబాద్ : మొబైల్ గవర్నెన్స్ లో దేశంలో రెండో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తన సొంత యాప్ ఫోలియోను విడుదల చేసింది. టీ-యాప్ ఫోలియో పేరుతో సొంత యాప్ ఫోలియోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం లాంచ్ చేశారు. అన్ని మొబైల్ ఆధారిత సేవలకు ఒకే ప్లాట్‌ఫామ్ టీ-యాప్ ఫోలియోను విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. టీ-యాప్ ఫోలియో అనే యాప్ సాధారణమైనది కాదని, దీని ద్వారా ప్రస్తుతం 150 మేర ప్రజా సేవలు అందిస్తామన్నారు. అనంతరం ఏడాది లోపు వెయ్యి సర్వీసులను ఈ యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖల యాప్స్‌ని ఈ టీ-యాప్ ఫోలియోకు ఇంటిగ్రేట్ చేసినట్టు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ, ఎం వాలెట్, టీ వాలెట్, హ్యాక్ ఐ లాంటి యాప్స్‌ను కూడా టీ-యాప్ ఫోలియోలో ఇంటిగ్రేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇంటింటికీ ఇంటర్‌నెట్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న టీ ఫైబర్‌తో 15జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ అందిస్తామని కేటీఆర్ తెలిపారు. టీ వాలెట్ ద్వారా 120 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. టెక్నాలజీ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.టీ-యాప్ ఫోలియో లాంచింగ్ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్ కమిషనర్ సీ వీ ఆనంద్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment