సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల పదవీకాలం జూలైతో ము గియనుంది. ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారీగా మండల, జిల్లా పరిషత్ స్థానాల పునర్విభజన చేశారు. ఈ నెల 20న మండల స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు, జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేశారు. 22 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిష్కరించి సోమవారం తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు.
కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ మండలాలు, పంచా యతీలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 16న జిల్లా అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించా లని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీరాజ్ అధికారులు ఈ నెల 20న పునర్ వ్యవస్థీకరించిన జెడ్పీ, మండల స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ నెల 21, 22వ తేదీల్లో 19 అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 23, 24 తేదీల్లో 19 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించారు. పూర్వపు వరంగల్ జిల్లాలో 705 ఎంపీటీసీలు, 50 జెడ్పీటీసీలున్నాయి.
తగ్గిన ఎంపీటీసీలు..
జిల్లాలో పునర్ వ్యవస్థీకరణ కంటే ముందు 188 ఎంపీటీసీలు స్థానాలుండేవి. పునర్విభజనతో 178కి చేరింది. దీంతో జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. పరకాల, నర్సంపేట మునిసిపాలిటీల్లో పలు గ్రామాలు విలీనమయ్యాయి. అలాగే వర్ధన్నపేట, డీసీ తండా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా మారాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీల స్థానాలు తగ్గాయి. ఈ మేరకు జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు 16కు చేరాయి.
2500లలోపు ప్రజలు ఉంటున్నవి 22 ఎంపీటీసీలు
జిల్లాలో మండలం యూనిట్‌గా 2011 జనాభా ప్రాతిపదికన 2500 నుంచి 5వేల మంది జనాభాకు ఒక ఎంపీటీసీని కేటాయించారు. 2500 మంది జనాభా లోపు ఉన్న ఎంపీటీసీలు 22 ఉండగా 2500 నుంచి 5వేల మంది ఉన్న జనాభావి 156 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment