'సోనియా గాంధీని జనం మరిచిపోయారు'
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మరిచిపోయారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలుగా పేరున్న డీ శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఆర్ సురేశ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటివారు జిల్లాకు చేసిందేమీలేదని విమర్శించారు.
ఆంధ్ర పాలకులవ్లలే తెలంగాణ అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ఎండవల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.