critisizes congress party
-
మోకాళ్ల యాత్ర చేసినా నమ్మరు
నర్సాపూర్ : కాంగ్రెస్ నాయకులు మోకాళ్లపై యాత్ర చేసిన ప్రజలు, రైతులు వారిని నమ్మరని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఘనపూర్ ఆనకట్ట, సింగూరు అంటూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా సింగూరు, ఘనపూర్ ఆనకట్టల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. జిల్లా నుంచి నీటి పారుదల శాఖ మంత్రిగా సునీతారెడ్డి పని చేసినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఘనపూర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. అదంతా మరిచి నేడు జలదీక్ష, పాదయాత్ర అంటూ సునీతారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సింగూరు, ఘనపూర్ ఆనకట్టలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఘనపూర్ ఆనకట్టను పట్టించుకోనందున ఆయకట్టు 21 వేల ఎకరాల నుంచి పది వేల ఎకరాలకు తగ్గిందని విమర్శించారు. నిధులు ఎందుకు మంజూరు చేయలేదు.. తాము అధికారంలోకి రాగానే చరిత్రలో ఎపుడు లేని విధంగా ఘనపూర్ ఆనకట్టకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం సాగు 21 వేల 530 ఎకరాలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం హయాంలో సింగూరు నీళ్లు జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్‌కు తీసుకుపోయేవారన్నారు. తాము అధికారంలోకి రాగానే హైదబాద్‌కు గోదావరి నీళ్లు తెప్పించి సింగూరు నీళ్లను జిల్లాకే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 20 ఏళ్ల చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు రెండు టీఎంసీ నీళ్ల కన్న ఎక్కువ నీటిని సాగుకు ఇవ్వలేదన్నారు. తాము 2016– 17, 2017–18 సంవత్సరాల్లో మూడున్నర టీఎంసీల వంతున నీటిని సాగుకు ఇచ్చామన్నారు. వర్షాలు కురిసి ఏమాత్రం నీళ్లు వచ్చినా ఘనపూర్, నిజాంసాగర్ కింద సాగుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సునీతారెడ్డి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నపుడు మంజీర, హల్దీవాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లలో 14చెక్‌డ్యాంల నిర్మాణానికి గాను సుమారు వంద కోట్ల రూపయాలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలాఉండగా సింగూరు లిప్టును చాలా ఏళ్లు మంజూరు చేయలేదని 2008 లో లిప్టు ద్వారా నీరు ఇవవాలని ఆందోలు మండల ప్రజలు అడిగినా పూర్తి చేయలేదని ఆరోపించారు. కాగా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండెళ్లకు 120 కోట్ల రూపాయలతో సింగూరు లిఫ్టును పూర్తి చేయడంతో ఆందోలు, పుల్కల్ మండలాల్లో 30 వేల ఎకరాలకు భూముల సాగుకు నీరు అందుతుందన్నారు. సింగూరులో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాలకు గాను 5.7టీఎంసీల నీరు జిల్లాకు అవసరమవుతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే ప్రభుత్వమని రైతులకు ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ను వారు నమ్మరన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, లక్ష్మి, అశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్‌లు పాల్గొన్నారు. -
బీజేపీ ఏం అన్యాయం చేసింది?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బీజేపీ అంటే పడనివారు తమపై విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో బీజేపీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. గవర్నర్ న్యాయం ప్రకారమే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ మార్కులు వచ్చినందుకే గవర్నర్ పిలిచారన్నారు. కానీ ఇద్దరు కలిసి మాకు ఎక్కువ మార్కులు వచ్చాయని అంటే ఎలా కుదురుతుందని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. గోవాలో కాంగ్రెస్ వారు గవర్నర్‌కి లేఖ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అయినా ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో రాష్ట్రం తీసుకోవాలని ఏముందని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుతుంటాయని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాద ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టకుండా బాధితులకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే వాటర్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జల రవాణాకు సంబంధించి బోట్లకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికే ఇవ్వాలన్నారు. -
మీ దిక్కున్న చోట చెప్పుకోండి
తిరుమలాయపాలెం : ఇన్నాళ్లు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా జవాబు చెప్పారు. సోమవారం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో మాట్లాడారు. రైతాంగానికి సాగునీరు కల్పించడంతోపాటు, 24 గంటల విద్యుత్ అందించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేయడంతోపాటు రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద తరతమ భేదం లేకుండా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలైనా ప్రవేశ పెడతామని, కాంగ్రెస్ నాయకుల్లారా.. ‘మీ దిక్కు న్న చోట చెప్పుకోండని’ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశ పెట్టామని రానున్న రోజు ల్లో వరినాట్లు వేసే యంత్రాలను కూడా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరగకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములను భూ యాజమాన్య హక్కు పత్రాలు కల్పించేందుకు యావత్ అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లోని రచ్చబండల వద్దకు పంపించి పైసా ఖర్చులేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ డం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. గత ంలో లాగా దొంగ పహాణీలు, పాస్ పుస్తకాలకు అవకాశం లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తూ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఆనాడు సాగునీరు కల్పించే అవకాశం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రజల ఆదరాభిమానాలతో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు కల్పిస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరుని అగ్రగామిగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జెడ్పీ సీఈఓ నగేశ్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వెంకటపతిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మద్దినేని మధు, జిల్లా సభ్యులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాలమూరుకు వరం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా పాలమూరు జిల్లా రైతాంగానికి ఒక వరంలా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున ఇవ్వనున్న నగదు జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి గ్రామంలో రైతుబంధు పథకాన్ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పథకం కింద దాదాపు 3.5లక్షల మంది రైతులకు రూ.354 కోట్లు, మక్తల్ నియోజకవర్గంలో 65,900 మంది రైతులకు రూ.93.16 కోట్లు, కాట్రేవ్‌పల్లి గ్రామంలో 357 మంది రైతులకు రూ.53లక్షలను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతీ ఎకరాకు రైతుబంధు పథకం కింద నగదు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని మంత్రి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రైతాంగానికి కొత్త ధైర్యం వచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతు రోజురోజుకు అప్పులలో కూరుకుపోతున్నాడనే ఆలోచనతో ఒక నిజమైన రైతుగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 70ఏళ్లుగా రైతుల ఓట్లతో రాజ్యమేలిన నేతలు వారి బతుకులను ఆగం చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి మొదలుకుని గ్రామ సర్పంచ్ వరకు అందరూ రైతు బిడ్డలం అని చెప్పుకుంటున్నా రైతుల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందని ప్రశ్నించారు. యాసంగి పంటకు అందజేస్తాం... పెట్టుబడి సాయాన్ని ఏటా వానాకాలంతో పాటుయాసంగి సీజన్‌కు కూడా అందజేస్తామని మంత్రి పోచారం తెలిపారు. ప్రతీ ఏటా మే 17వ తేదీ వరకు వానాకాలం పెట్టుబడి చెక్కులు, అలాగే నవంబర్ 18 నుంచి యాసంగి పెట్టుబడి చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతులకు ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసిన దాఖలాలు లేవన్నారు. వ్యాపారస్తులు తమ పిల్లలకు ఆస్తులను వారసత్వంగా అందిస్తుంటే.. రైతులు మాత్రం అప్పులను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతుండటాన్ని తట్టుకోలేక ఒక రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాదు గత ప్రభుత్వాల హయాంలో కరెంట్రాక, పంటలు ఎండిపోయి రాస్తారోకోలు, ఆందోళనలు జరిగేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్‌ను 24గంటల పాటు అందించేలా కృషిచేశారన్నారు. అదే విధంగా రైతు ఏదైన ప్రమాదవశాస్తు మరణిస్తే ఆకుటుంబాన్ని ఆదుకోవడం కోసం రూ.5లక్షల ప్రమాదభీమాను కల్పించారని, దానికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అదనంగా 30 ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారని, స్థానిక పరిస్థితులను పరిశీలించాక ఎమ్మెల్యే అడిగిన వాటికి అదనంగా మరో 20 కలిపి 50 ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే నైరుతికి వచ్చా... వాస్తు ప్రకారం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఈశాన్య ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారని మంత్రి పోచారం వెల్లడించారు. అలాగే నైరుతి ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలో పథకం ప్రారంభానికి సీఎం ప్రతినిధిగా తనను పంపించారని తెలిపారు.అదేవిధంగా రైతు సమన్వయ నేతలు, వ్యవసాయ అధికారులు సమావేశమవడానికి క్లస్టర్ వేదికగా ‘రైతు వేదిక’ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అనుగుణంగా క్లస్టర్ల వారీగా స్థలాలు కేటాయించేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్‌కు పది సీట్లు కూడా రావు.. రైతులకు మేలు చేసే పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని మంత్రి పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను న్యాయస్థానాల్లో కేసుల ద్వారా అడ్డుకున్నట్లు రైతుబంధు పథకంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. కుంభకోణాలు చేసే ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు.. మిగతా వారు కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఒకవేళ పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే సీటు మీద కూర్చోడానికి డజను మంది పోటీ పడుతున్నారని, ఒక్కడు కూర్చుంటే వంద మంది కాలు పట్టి లాగుతారన్నారని ఎద్దేవా చేశారు. చాలా ఆనందంగా ఉంది! అడ్డాకుల : పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి కోసం సాయం చేసిన ప్రభుత్వాలను చూడలేదు. నాకు 4.18 ఎకరాల భూమి ఉంటే రూ.17,800 చెక్కు వచ్చింది. వరి, పత్తి పంటలను సాగు చేయడానికి వీటిని వినియోగిస్తాను. రైతులకు మరిన్ని విధాల సాయం చేయడానికి ప్రభుత్వాలు పని చేయాలి. -
కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు
పాపన్నపేట(మెదక్): ‘కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువయ్యారు’. అంటూ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దెప్పి పొడిచారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విధానాలపై దేశం అంతా మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం నొచ్చుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మెదక్ జిల్లాకు సాగునీరందించేందుకు కృషి చేస్తుంటే కాంగ్రెసోళ్లు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. మెతుకుసీమకు ప్రాణాధారమైన మంజీరానదిలోని ప్రతినీటిబొట్టును వినియోగించుకుంటూ రైతన్నల బతుకులు మారుస్తామని స్పష్టం చేశారు. 65 యేళ్ల కాంగ్రెస్ పాలనలో 110 సంవత్సరాల ఘనపురం ఆనకట్ట చరిత్రలో రైతులు ఆందోళన చేయకుండా నోటిమాట కూడా అడక్కుండానే వారి పంట పొలాలకు సింగూర్ నుంచి సాగు నీరిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్‌జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. అందుకే రూ.100కోట్లతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతోపాటు కాల్వల ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. తద్వారా ఈయేడు 25వేల ఎకరాల్లో వరిపంట పండిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంటే జిల్లాకు రైలు వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ నాటికి రైలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్ట్‌లపై సీడబ్లు్యసీ చైర్మన్ మసూద్ హుస్సెన్, బిహర్, కర్ణాటక మంత్రులు మెచ్చుకుంటున్నారని తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మెదక్ ప్రజల 60యేళ్ల కలను సాకారం చేశారని తెలిపారు. మెదక్ డీఎస్పీ కార్యాలయానికి రూ.40లక్షలు, టేక్మాల్, జోగిపేట పోలీస్ స్టేషన్ భవనాలకు రూ.1కోటి, మెదక్‌లో సీఐ కార్యాలయానికి రూ.40లక్షలు, జోగిపేటలో రిషప్షన్ సెంటర్‌కు రూ.1.50కోట్లు, మెదక్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్ భవనానికి రూ.10కోట్లు, తూప్రాన్‌లో సీఐ కార్యాలయానికి రూ.35లక్షలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో సుమారు రూ.35.65కోట్ల వ్యయంతో పోలీసు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్ జిల్లాలో రైల్వేలైన్, హైవే, మెదక్‌చర్చి, ఘనపురం ఆనకట్ట, ఏడుపాయల దేవస్థాన అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో బీజేపీ తన ఎన్నికల మెనిఫేస్టోలో పెట్టిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, సుధాకర్‌రెడ్డి, ఫరీరుద్దీన్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబుమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ రాజమణి, చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, జేసి నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తోందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుపుఖాయమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తేల్చిచెప్పారు. ప్రజలు మంచి చెడును గమనిస్తున్నారని, చెడును తుంగలో తొక్కడం ఖాయమన్నారు. సిండికేట్ వ్యాపారాలను ప్రోత్సహించిన వారికి గుణపాఠం తప్పదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని హెచ్చరించారు. దొంగలు..దొంగలు.. కలిసి ఊర్లు తిరుగుతున్నారని, వాళ్లకు ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. గత ఎన్నికల్లో సిగ్గు లేకుండా తిట్టుకున్న వారే కలిసి తిరుగుతుంటే సూర్యాపేట ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రూ.2468 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రబీలో సాగర్ జలాలలతో రెండో పంటను అందుకున్న రైతులు ఆనందం పడుతుంటే సాగర్ ఎమ్మెల్యే జానారెడ్డి మాత్రం చివరి భూములకు నీళ్లు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. జానారెడ్డి చివరి భూముల్లో తిరుగుతుండడం చూస్తుంటే ఆయనతో పనిచేయించినట్లుగా తనకు ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో వార్డులు పర్యటిస్తున్న దామోదర్‌రెడ్డి గతంలో పర్యటించి అభివృద్ధి చేస్తే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఎన్ని వార్డులు తిరిగినా అవసరమైన పనులు చూపిస్తే అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. కలెక్టరేట్ నిర్మాణం, ఎస్పీ కార్యాలయ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కమ్యూనిటీ హాళ్లు, సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ’20కోట్లు ఖర్చు చేశామన్నారు. పుల్లారెడ్డి చెరుకు కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మెడికల్ కళాశాల సూర్యాపేటకు మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. అభివృద్ధికి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, తాహేర్‌పాషా, బూరబాల సైదులు, మహేశ్వరి, రమణ, నర్సింహారావు, బాషా, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు. -
రూ.50 కోట్లు తెచ్చిన చరిత్రేనా?
పెద్దపల్లి : ఒక్క రోజే రూ.52కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని..ఐదేళ్ల పాలనలో రూ.50కోట్లు తెచ్చిన చరిత్ర మీకుందా..అంటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుపై మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. పెద్దపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఈటల కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. పాత జిల్లా చీలికలై నాలుగు జిల్లాలుగా ఏర్పడినప్పటికీ మనందరిదీ కరీంనగర్గానే చూడాలన్నారు. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి ఉదారంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులలో లేసినోళ్లు.. లేవనోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. సహించేది లేదన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ హరితహారం విధానంపై దాసరి మనోహర్‌రెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారన్నారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరినట్టుగా గుంపుల, గూడెం రోడ్లతోపాటు బౌద్ధస్థూపం వద్దకు తారు రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు అవసరమైన ఎస్సారెస్పీ నీరిచ్చేందుకు మంత్రి హరీష్‌రావు ఒప్పుకున్నారన్నారు. జిల్లాకు మంజూరైన మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను వేగవంతంగా నిర్మించాలని మంత్రి తుమ్మలను కోరారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విదేశాల్లోనూ చర్చించుకుంటున్నారన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేశ్‌కుమార్, ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, నాయకులు రఘువీర్‌సింగ్, నల్ల మనోహర్‌రెడ్డి, మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్, వేదికపై ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ కోట రాంరెడ్డి, ఐలయ్యయాదవ్, సారయ్యగౌడ్, సందనవేని సునీత, పాల రామారావు, మర్కు లక్ష్మణ్, పాటకుల అనిల్, కమల దయాకర్, కవ్వంపల్లి లక్ష్మి, గట్టు రమాదేవి, లంక సదయ్య, కుక్క కనకరాజు, కాంపెల్లి నారాయణ, ఉప్పు రాజ్‌కుమార్, ఉప్పు రాజు, పడాల సతీష్‌గౌడ్, కొయ్యడ సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లకు శంకుస్థాపన.. గోదావరిఖని/రామగుండం: రామగుండం ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఫైవింక్లయిన్ సమీపంలో సింగరేణి స్థలంలో రూ.9.60కోట్లతో 160 ఇళ్లను నిర్మించనున్నారు. మంత్రి మాట్లాడు తూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, కమిషనర్ డి.శ్రీనివాస్, సోమారపు లావణ్య, అరుణ్‌కుమార్, పెద్దెల్లి ప్రకాశ్, బాబుమియా, ఆర్అండ్బీ ఈఈ ఎం.కృష్ణమూర్తి, డీఈ ఎం.జయప్రకాశ్, జేఈ సురాజొద్దీన్ పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డు భగత్‌సింగ్‌నగర్, సిక్కువాడలో నివసిస్తున్న తమకు వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని.. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తమ ఇళ్లను తొలగించవద్దని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కార్యాలయం భవనాలకు శంకుస్థాపన అంతర్గాంలో నూతనంగా నిర్మించే మండల పరిషత్ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనులను మంత్రి, ఎంపీలు ప్రారంభించారు. రెండెకరాల్లో రూ.కోటితో ఎంపీడీవో, వ్యవసాయం, ఉపాధిహామీ, ఈవోపీఆర్డీ, ఎంపీపీ కార్యాలయాలను నిర్మించనున్నారు. అనంతరం మండలకేంద్రంలో డబుల్ ఇళ్ల పనులను ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, కలెక్టర్ శ్రీదేవసేన ప్రారంభించారు. ఎంపీపీ రాజేశం, సర్పంచులు మడ్డి శశికళ, భూపెల్లి లత, పొన్నం లత, ఆముల శ్రీనివాస్, గంగాధరి శ్రీనివాస్‌గౌడ్, తీగుట్ల రాజయ్య, వైస్‌ఎంపీపీ కొదురుపాక పవన్, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు మాడ నారాయణరెడ్డి, అర్శనపల్లి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ జూల లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్దంపేట శంకర్, సింగిల్‌విండో డైరెక్టర్ బండారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
దళితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
స్టేషన్‌ఘన్‌పూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను దగా చేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చేపూరి వినోద్ విమర్శించారు. శివునిపల్లిలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన వినోద్‌ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. తీరా రాష్ట్ర ఏర్పాటయ్యాక దళితులను దగా చేశారని విమర్శించారు. ఎట్టకేలకు డాక్టర్ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్.. ఆరునెలల్లోనే బర్తరఫ్ చేశారని తెలిపారు. ఇంటికో ఉద్యోగమంటూ యువతను, నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, కానీ ఎక్కడా ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. కేవలం వారి కుటుంబంలోనే ఐదుగురికి రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ హామీ ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. దళిత, గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తుల కట్టయ్య, ఘన్పూర్ పట్టణ అధ్యక్షుడు గోనెల ఎల్లయ్య, నాయకులు బైరు బాలరాజు, న్యాయం సంపత్‌రెడ్డి, గాబు శ్రీనివాస్‌రెడ్డి, కుంభం ఉపేందర్, గుర్రం సోమయ్య, ఓరుగంటి వెంకటేశ్వర్లు, గుర్రం రాజు, కొడెపాక సుధాకర్, గొడుగు రాజయ్య, కత్తుల గట్టుమల్లు, బైరు నాగరాజు, భూక్య ఆము, భూక్య శ్రీను, నక్క పాపయ్య, ఏలియా, అశోక్ పాల్గొన్నారు. -
'సోనియా గాంధీని జనం మరిచిపోయారు'
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మరిచిపోయారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలుగా పేరున్న డీ శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఆర్ సురేశ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటివారు జిల్లాకు చేసిందేమీలేదని విమర్శించారు. ఆంధ్ర పాలకులవ్లలే తెలంగాణ అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ఎండవల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.