ఐఏఎస్‌ శశాంక్‌ గోయల్‌ ఇంట విషాదం | Telangana Principal Secretary Son Killed In Turkey | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ శశాంక్‌ గోయల్‌ ఇంట విషాదం

Published Mon, May 28 2018 5:57 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Telangana Principal Secretary Son Killed In Turkey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కార్మిక, ఉద్యోగ నైపుణ్య, పరిశ్రమల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులతో కలిసి టర్కీ పర్యటనకు వెళ్లిన శశాంక్‌ గోయల్‌ కుమారుడు శుభమ్‌ గోయల్‌(24) అక్కడ జరిగిన ఘర్షణలో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

శశాంక్‌ గోయల్‌ ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందినవారు. ఆయన కుమారుడు శుభమ్‌ గోయల్‌ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. న్యూఢిల్లీలో ఓ పెళ్లికి హాజరైన శుభమ్‌.. స్నేహితులతో కలసి టర్కీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. శుభమ్‌ మరణవార్త ఈ నెల 26న కుటుంబసభ్యులకు తెలిసినట్లు సమాచారం.

శుభమ్‌ మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. శుభమ్‌ అంత్యక్రియల కొరకు అతని మృతదేహాన్ని సొంతవూరు రూర్కీకి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement