ఐటీ శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో జయేశ్‌రంజన్
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఐటీ రంగం అద్భుత ప్రగతిని సాధించిందని, జాతీయ సగటుకు మించి ఐటీ సేవలను ఎగుమతి చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు జాతీయ సగటు 8.09 శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రం 17.97 శాతం వృద్ధిని సాధించిందన్నారు. రాష్ట్రానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు సైతం వచ్చాయన్నారు. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాయని గుర్తుచేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ విస్తరణకు ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమయ్యాయని, టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు వరంగల్‌లో తమ కేంద్రాలను ప్రారంభించాయన్నారు. వరుసగా ఆరో ఏడాది శనివారం ఆయన ఇక్కడ రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక ప్రగతి నివేదిక–2019–20ను ఆ విష్కరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ కీలక సేవలందిం చిందని కేటీఆర్ ప్రశంసించారు. కరోనా రో గులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని గుర్తించే ందుకు, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిఘా ఉంచేందుకు, వలంటీరింగ్ వంటి విషయాల్లో ఐటీ శాఖ సాంకేతిక సేవలందించిందని, పలు డిజిటల్ సొల్యూషన్లు అందించేందుకు భాగస్వామిగా నిలిచిందన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు..
► 2018–19తో పోలిస్తే 2019–20లో దేశ ఐ టీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 % నుంచి 11.58 శాతానికి పెరిగింది.
► ఐటీ ఉద్యోగాల వృద్ధిరేటు జాతీయ సగటు 4.93 శాతం ఉండగా, తెలంగాణలో 7.2%గా నమోదైంది.
► తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) ఆధ్వర్యంలో మీ–సేవ కేంద్రాల ద్వారా రోజూ లక్షమంది 600కుపైగా సేవలు పొందుతున్నారు.
► ఆన్‌లైన్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవల కోసం తీసుకొచ్చిన టీ–యాప్‌ఫోలియో మొబైల్ యాప్‌ను 7లక్షలకుపైగా మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దీని ద్వారా 225 రకాల సేవలను 32 శాఖల భాగస్వామ్యంతో అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment